ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో రికార్డు
ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ చరిత్ర సృష్టించారు. 600 బిలియన్ డాలర్లకు పైగా నెట్‌వర్త్ సాధించిన తొలి వ్యక్తిగా నిలిచినట్లు ఫోర్బ్స్ వెల్లడించింది. 2026లో 800 బిలియన్ డాలర్ల విలువతో స్పేస్-X ఐపీవోకు వస్తుండటంతో మస్క్ సంపద గణనీయంగా పెరిగింది. అక్టోబర్‌లో 500B డాలర్ల మార్క్‌ను దాటిన మస్క్, కేవలం 2 నెలల్లోనే మరో 100B డాలర్లను సంపాదించారు. ప్రస్తుతం ఆయన నెట్‌వర్త్ సుమారు $677Bగా ఉంది.








Comments