• Sep 20, 2026
  • NPN Log

    సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు తెరకెక్కించిన తాజా డివైన్ మిస్టిక్ థ్రిల్లర్ ‘అగధ’. కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కేఆర్ సమర్పణలో కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. ఆగస్ట్‌లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్‌ను అందుకుంది. ఎంఎస్ రాజు మార్క్ సస్పెన్స్ నరేషన్, నాని చమిడిశెట్టి విజువల్స్, రాకేష్ వెంకటాపురం అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను హిట్ ట్రాక్‌లో నిలబెట్టాయి. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించిన ఈ డివైన్ బ్లాక్‌బస్టర్ మూవీ.. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘జీ5’ లో సెప్టెంబర్ 25 నుంచి ‘అగధ’ గ్రాండ్‌గా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది.

    ఈ చిత్రంలో కామాక్షి భాస్కర్ల  తో పాటు శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, సీనియర్ నటుడు భాను చందర్, షిజు, వనిత విజయ్‌కుమార్, రోషన్ బషీర్, శ్రేయా రాణి రెడ్డి, వివా రాఘవ, రాబర్ట్ మాస్టర్, ఆర్నా ములేర్, కనకవ్వ తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెప్పించారు. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. థియేటర్లలో అదిరిపోయే ట్విస్టులతో సస్పెన్స్ థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకున్న ‘అగధ’, ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు వచ్చే వారం సెప్టెంబర్ 25 నుంచి జీ5 వేదికగా ఈ డివైన్ థ్రిల్లర్‌ను వీక్షించవచ్చు.

     

     

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement