అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక కోరిన రోడ్లు మంజూరు
ఆంధ్ర ప్రదేశ్ : ప్రపంచకప్ గెలిచిన అంధ మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తన ఊరికి రోడ్డు లేదని నిన్న డిప్యూటీ సీఎం పవన్‌ను కలిసినప్పుడు తెలిపారు. శ్రీసత్యసాయి(D) హేమావతి-తంబలహెట్టి వరకు రోడ్డుకు రూ.3.2CR, గున్నేహళ్లి-తంబలహెట్టి రోడ్డుకు రూ.3CR అవసరమని అధికారులు అంచనా రూపొందించగా, పర్మిషన్ ఇవ్వాలని పవన్ ఆదేశించారు. సాయంత్రానికి జిల్లా కలెక్టర్ పాలనపరమైన అనుమతులిచ్చారు. మరోవైపు జట్టుకు పవన్ రూ.84లక్షల ప్రోత్సాహకం అందించారు.










Comments