కుక్కకు సమాధి.. వైద్యానికి రూ.7 లక్షల ఖర్చు
ఆ శునకాన్ని కుటుంబంలో ఒకటిగా పెంచుకున్నారు. వయోభారం కారణంగా అనారోగ్యం పాలైతే రూ.7 లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయించారు. మరణానంతరం సమాధి కట్టించి దానిపై ప్రేమను చాటుకున్నారు. చిత్తూరు సిద్ధార్థనగర్‌కు చెందిన డాక్టర్ సుదర్శన్... పదేళ్ల క్రితం జర్మన్ బ్రీడ్‌కు సంబంధించిన శునకాన్ని తెచ్చుకుని.. దానికి బాక్సీ రాట్‌విల్లర్ అని పేరుపెట్టి పెంచుకున్నారు. పగలూ రాత్రి ఇంటికి కాపలా కాస్తూ.. గతంలో రెండు సార్లు ఇంట్లో జరగబోయిన చోరీలను అడ్డుకుంది. ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో చెన్నై, బెంగళూరు ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించారు. నవంబరు 11న ఆ కుక్క మరణించడంతో కుటుంబసభ్యులు కుంగిపోయారు. దానికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. దానిపై ఉన్న ప్రేమతో రూ.2 లక్షలు ఖర్చుపెట్టి సమాధి కట్టించారు.








Comments