అనుకోని అతిథి ఎందుకొచ్చారు?
యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తెలంగాణ పర్యటన ఆసక్తికరంగా మారింది. వచ్చీ రావడంతోనే సీఎం రేవంత్ రెడ్డి తో, ఆ వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనూ సమావేశం అయ్యారు. త్వరలోనే అఖిలేశ్ కేసీఆర్ ను కలుస్తారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దీంతో బీజేపీ కి వ్యతిరేకంగా మరో కూటమి ఏర్పాటు చేస్తున్నారా అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. విభజన రాజకీయాలు అంతం కావాలని అఖిలేశ్ చెప్పడంతో కూటమి ప్రయత్నాలే అంటూ చర్చ మొదలైంది.










Comments