• Sep 20, 2026
  • NPN Log

    అనంతపురం : అనంతపురం జిల్లా గుంతకల్లులో ట్రాన్స్‌జెండర్ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. వీరి వివాదం తీవ్ర విషాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ట్రాన్స్‌జెండర్ సోదరుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు దారితీసిన పరిస్థితుల గురించి పోలీసులు ఆరా తీశారు. ప్రాథమికంగా ట్రాన్స్‌జెండర్ల మధ్య నెలకొన్న పోరే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

    ఈ హత్యకు సంబంధించి నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ ఘటనకు ముందు ఏం జరిగింది.?, మృతుడితో ఎవరికైనా వివాదాలు ఉన్నాయా.?, ఈ హత్యలో ఎంతమంది పాల్గొన్నారు.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement