• Sep 22, 2026
  • NPN Log

    కామెడీకి కాస్త అనుమానాన్ని జోడించి తెరకెక్కిన చిత్రం ‘అనుమాన పక్షి’. రాగ్‌మయూర్‌, మెరిన్‌ ఫిలిప్‌ జంటగా నటించిన ఈ సినిమాకు ‘డీజే టిల్లు’ ఫేమ్‌ విమల్‌కృష్ణ దర్శకత్వం వహించారు. చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌ చిలక, రాజేశ్‌ జగ్తియాని, హీరాచంద్‌ దండ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబరు 18న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినాయకచవితి సందర్భంగా చిత్రబృందం మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఆద్యంతం కామెడీతో పాటు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగింది.

    ప్రతి చిన్న విషయాన్ని అనుమానించే ఓ వ్యక్తి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అతడి అనుమానాల కారణంగా అతని జీవితంలోనే కాకుండా.. అతని చుట్టూ ఉన్నవారి జీవితాల్లోనూ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే అంశాన్ని వినోదాత్మకంగా చూపించినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది.  

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement