• Sep 20, 2026
  • NPN Log

    ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (Cert-In) తాజాగా ఆండ్రాయిడ్ డివైజ్ యూజర్లను అప్రమత్తం చేసింది. యూజర్లు వెంటనే తమ డివైజులను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ 14, 15, 16, 16 క్యూపీఆర్2, ఆండ్రాయిడ్ 17తో నడిచే డివైజ్‌లు ఉన్న వారందరూ వీలైనంత త్వరగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఆండ్రాయిడ్ రన్‌టైమ్, డాక్యుమెంట్స్‌యూఐ, మీడియాటెక్ ఫ్రేమ్‌వర్క్, మీడియాకోడెక్స్, మీడియాప్రొవైడర్, టెలిఫొనీ, యూడ్ల్బ్యూబీ, వైఫై వంటి ఆండ్రాయిడ్ కాంపోనెంట్స్‌లో కొన్ని భద్రతా సమస్యలు బయటపడ్డాయని Cert-In చెప్పింది. వీటి ఆసరాగా హ్యాకర్లు ఫోన్‌లోకి చొరబడి వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగపరిచే అవకాశం ఉందని హెచ్చరించింది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకుంటే వెంటనే సమస్య తొలగిపోతుందని కూడా భరోసా ఇచ్చింది.

    ఈ విషయమై గూగుల్ ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్‌లను విడుదల చేసిన నేపథ్యంలో తక్షణం ఫోన్‌లను అప్‌డేట్ చేసుకోవాలని Cert-In సూచించింది. యూజర్లు తమ సెట్టింగ్స్ ఆప్షన్‌లోని సాఫ్ట్‌వేర్ లేదా సిస్టమ్ అప్‌డేట్ ద్వారా డివైజులను అప్‌డేట్ చేసుకోవచ్చు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్‌ను వాడటంతో పాటు గుర్తుతెలియని సోర్సుల నుంచి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోకుండా ఉంటే హ్యాకర్ల ముప్పు నుంచి సులువుగా తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement