• Sep 22, 2026
  • NPN Log

    ప్రముఖ సంగీత దర్శకుడు, నట దర్శకుడు, నిర్మాత ఆర్.పి. పట్నాయక్ గత కొంతకాలంగా ఆధ్యాత్మిక సంగీతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. గతంలోనూ ఆయన పలు భక్తి గీతాలను స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు. అయితే ఇటీవల 18 అధ్యాయాలతో కూడిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం ప్రాజెక్ట్ ను ఆయన విజయవంతంగా నిర్వహించారు. ఈ నేతృత్వంలో ఇటీవల ఆర్.పి. పట్నాయక్‌ తిరుపలితోని ఎస్వీబీసీ కార్యాలయంలో శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మను కలిసి, ఆయన నియామకానికి అభినందనలు తెలిపారు. ఇటీవల తాను చేపట్టిన 'దేవ కరుణామృతం, అప్ప అప్ప అయ్యప్ప సింగిల్‌, పిబరే రామ రసం పాటలున్న ఆల్బమ్ ను ఆయనకు అందచేశారు. తాను చేపట్టిన మరిన్ని ప్రాజెక్టుల వివరాలను శ్రీధర్‌ వర్మకు తెలియచేశారు.

    ఈ సందర్భంగా ఎస్వీబీసీ ఛైర్మన్ బి. శ్రీధర్ వర్మ ఆర్.పి. పట్నాయక్ చేపట్టిన భక్తి కార్యక్రమాలను అభినందించారు. ఆధ్యాత్మిక కంటెంట్ నాణ్యతపై ప్రశంసలు తెలియచేస్తూ, భక్తిభావాన్ని పెంపొందింప చేస్తున్న ఆర్పీ పట్నాయక్‌ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్వీబీసీతో సహకరించడానికి ఆయన చూపుతున్న ఆసక్తిని ఛైర్మన్ అభినందించారు. భవిష్యత్తులో ఎస్వీబీసీ వేదికగా మరిన్ని భక్తి కార్యక్రమాలను నిర్వహించాలనే తన ఆకాంక్షను ఆర్.పి. పట్నాయక్ వ్యక్తం చేశారు. ఇరువురు భక్తి సంగీత సిరీస్‌లు, ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఎస్వీబీసీ ద్వారా ప్రసారం చేయడానికి అవకాశాలను పరిశీలించారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement