కూతురు గొప్పా? కోడలు గొప్పా?
మన ధర్మం ప్రకారం కోడలే ఇంటికి గృహలక్ష్మి. పుట్టినింటిని వదిలి, మెట్టినింటి గౌరవం కోసం పేరును, జీవితాన్ని అంకితం చేసే త్యాగశీలి ఆమె. భర్తను ప్రేమగా చూసుకుంటూ అందరికీ అమ్మలా అన్నం పెట్టే గుణశీలి. పితృదేవతలు మెచ్చేలా వంశాన్ని ఉద్ధరించే శక్తి కోడలికే ఉంది. ఏ ఇంట కోడలిని గౌరవించి, లక్ష్మిగా భావిస్తారో ఆ ఇల్లు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఈ ఇంటి కూతురు మెట్టినింటి కోడలిగా వారి అభ్యున్నతికి కారణమవుతుంది.










Comments