• May 01, 2026
  • NPN Log

    చెన్నై : కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ వార్నింగ్ ఇచ్చారు. పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లు పాస్ చేస్తే.. భారీ ఉద్యమం చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి.. బిల్లు పాస్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ కేంద్రంపై ఆయన నిప్పులు చెరిగారు.

    1960 నాటి డీఏంకేను మళ్లీ పరిచయం చేస్తానంటూ కేంద్రానికి ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్‌పై ప్రమాణం చేస్తున్నానని.. తాను చేపట్టే ఉద్యమం తీవ్రంగా ఉంటుందన్నారు. ఇదే తన ఫైనల్ వార్నింగ్ అంటూ తమిళనాడు సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక వీడియోను సీఎం స్టాలిన్.. తన ఎక్స్ ఖాతా వేదికగా పోస్ట్ చేశారు.

    చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీ లిమిటేషన్ బిల్లుల ఆమోదం కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఏప్రిల్ 16,17,18 తేదీల్లో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ సమావేశాల్లో ఈ బిల్లుల ఆమోదం పొందాలనే దృఢ నిశ్చయంతో మోదీ ప్రభుత్వం ఉంది.

    మరోవైపు దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. రెండు రాష్ట్రాలు అసోం, కేరళతోపాటు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ముగిసింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది.

    ఏప్రిల్ 23వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా.. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి రెండు దశల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసమే ఈ బిల్లుల ఆమోదం అంశాన్ని మోదీ ప్రభుత్వం తెరపైకి తీసుకు వచ్చిదంటూ ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టాలిన్, మమతా బెనర్జీ విమర్శలు చేస్తున్నారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement