గోల్డ్, సిల్వర్ ధరల్లో క్రమంగా పెరుగుదల
పశ్చిమాసియా ఉద్రిక్తతలు తగ్గవచ్చన్న సంకేతాల నడుమ దేశీయంగా బంగారం, వెండి ధరల్లో గత రెండు రోజులుగా పెరుగుదల కనిపించింది. బ్యారెల్ ముడి చమురు ధర కూడా 100 డాలర్ల మార్కు దిగువకు చేరుకుంది. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు (ఏప్రిల్ 16) ఉదయం 6.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,360కు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,42,410గా ఉంది. కిలో వెండి ధర రూ.2,75,100గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర గరిష్ఠంగా రూ.1,56,230కు ఎగబాకింది. ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,55,360గా ఉంది. ఢిల్లీలో రూ.1,55,510 వద్ద తచ్చాడుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర చెన్నైలో రూ.1,43,210గా, ముంబై, కోల్‌కతా నగరాల్లో రూ.1,42,410గా ఉంది. ఢిల్లీలో రూ.1,42,560 వద్ద కొనసాగుతోంది. ఇక వివిధ నగరాల్లో కిలో వెండి ధర రూ.2.70 లక్షల నుంచి రూ.2.75 లక్షల మధ్య ఉంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర 4835 డాలర్లుగా వెండి ధర 80 డాలర్లుగా ఉంది. నిన్న భారత్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర సగటున రూ.1,420 మేర పెరగ్గా వెండి ధర (కిలో) రూ.15 వేల మేర ఎగబాకింది.










Comments