• Sep 20, 2026
  • NPN Log

    పసి పిల్లలు దేవునితో సమానం అంటారు. ఎవరు పలకరించినా.. కాళ్లు చేతులు ఊపుతూ బోసి నవ్వులు చిందిస్తారు. ఇలాంటి వీడియోలను నిత్యం చూస్తుంటాం. అయితే తాజాగా కోతి ప్రేమకు ఖుషీ అయిన చిన్నారి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అచ్చం మనుషులు.. చిన్న పిల్లలను ఎలా ఆడిస్తారో అలాగే కోతి ఆడిస్తుంది. ఆ వీడియోలో ఏడాదికి కాస్తా అటు ఇటుగా వయస్సు ఉన్న చిన్నారి మంచంపై పడుకుని ఉంది. ఆ పక్కనే కోతి కూర్చొని ఉంది. ఆ చిన్నారిని కోతి ముద్దు చేస్తూ.. ఆడిస్తోంది. కోతిని చూసి చిన్నారి కాళ్లు, చేతులూ ఊపుతూ కేరింతలు కొడుతోంది.

    కోతి తన తలను పదే పదే ఊపుతూ చిన్నారిని నవ్వించే ప్రయత్నం చేస్తోంది. అంతటితో ఆగకుండా మనుషుల తరహాలో ఆ చిన్నారి ఛాతీపై కోతి ముద్దు పెడుతోంది. కోతి ఇలా చేస్తున్నప్పుడు ఆ చిన్నారిలో ఏమాత్రం భయం కనిపించలేదు. చిన్నారి కాళ్లు చేతులు ఊపుతుంటే.. కోతి పరిశీలనగా గమనిస్తోంది. ఈ వీడియోను ashwin07282 అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు15 లక్షల మందికిపైగా వీక్షించి, లైక్‌లు చేశారు.

    ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. నిజమైన, స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం అంటే ఏమిటో ఈ కోతి మనకు నేర్పిందని కామెంట్ చేశారు. ఈ రోజుల్లో ప్రజలు ఒకరికొకరు దూరమవుతున్నారు.. ప్రేమకు భాష, హద్దులు లేవని ఈ వీడియో నిరూపిస్తుందని తెలిపారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement