• Sep 20, 2026
  • NPN Log

    టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వాలనే ఆశాభావంతో ఉన్నాడు. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా రెండు టైటిళ్లు సాధించడంలో భువీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. దీంతో అతడిని తిరిగి టీమిండియాలోకి తీసుకోవాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ఈ క్రమంలో తన పునరాగమనంపై భువీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను భారత్ తరఫున ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే జట్టులో చోటు కోసం గతంలో మాదిరి ఎదురుచూడటం లేదని స్పష్టం చేశాడు.

    ‘నేను ఏదో నిరూపించుకోవాలని క్రికెట్ ఆడటం లేదు. కానీ మళ్లీ భారత్ తరఫున ఆడే అవకాశం వస్తే చాలా సంతోషిస్తా. అలాగని గతంలో మాదిరి జట్టులో చోటు కోసం ఎదురుచూడటం లేదు. నేను ఎప్పుడో ఆ దశను దాటేశా. జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒకసారి నాకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. కొన్ని సిరీస్‌ల వరకు నేను తిరిగి జట్టులోకి వస్తాననే అనుకున్నా. వాళ్లు చెప్పిన దాన్ని బట్టి చూస్తే.. తదుపరి రెండు సిరీస్‌లలో నాకు అవకాశం రావచ్చని భావించా. కానీ ఆ తర్వాత పరిస్థితి అలా లేదని అర్థమైంది. అయితే ఈ పరిణామం నన్ను పెద్దగా బాధించలేదు. అక్కడ ఏం జరుగుతుందో అర్థమైన తర్వాత పరిస్థితులను అంగీకరించడం మొదలుపెట్టా. ఆ దశ నా కెరీర్‌లోనే అత్యంత క్లిష్టమైనది. ఆ సమయంలో నా కుటుంబం ఎంతో అండగా నిలిచింది’ అని భువీ వెల్లడించాడు.

    2022లో చివరిసారిగా..

    భువనేశ్వర్‌ కుమార్‌ చివరిసారిగా 2022 నవంబర్‌లో భారత్‌ తరఫున టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్లో ఓడిన అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో అతడు చివరిసారి జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగాడు. మొత్తంగా భారత్‌ తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 229 మ్యాచ్‌లు ఆడిన భువనేశ్వర్‌ కుమార్‌.. 294 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఏడు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement