‘టెస్ట్’ల సమయంలో నిద్ర పట్టేది కాదు..
న్యూఢిల్లీ: టెస్ట్ మ్యాచ్ల సమయంలో తనకు ఓ పట్టాన నిద్ర పట్టేది కాదని టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్’ అనే కార్యక్రమంలో హిట్మ్యాన్ తన ‘టెస్ట్’ అనుభవాలను పంచుకొన్నాడు. ‘నేను అబద్ధాలు చెప్పడంలేదు. టెస్ట్లు ఆడే సమయంలో నాకు లోపల గందరగోళంగా ఉండేది. ఒత్తిడితో సరిగ్గా నిద్ర పట్టేది కాదు. దాంతో ఆకలి వేసేది. ఆ సమయంలో అమ్మ అరటి పండ్లతో చేసిన బిస్కెట్లను బాగా లాగించేవాడిని’ అని తెలిపాడు.










Comments