• Sep 20, 2026
  • NPN Log

    న్యూయార్క్‌: అంతర్జాతీయ మీడియా, వినోద రంగ దిగ్గజం ‘ది వాల్ట్‌ డిస్నీ’ తన తొలి చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ (సీటీఓ)గా భారత్‌కు చెందిన కరణ్‌దీప్‌ ఆనంద్‌ను ఎంచుకుంది. వచ్చే నెల 2న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. డిస్నీ సీఈఓ జోష్‌ డీఅమారోకు నేరుగా రిపోర్టు చేయనున్నారు. హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ ఐటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన కరణ్‌దీప్‌.. ఇదివరకు జనరేటివ్‌ ఏఐ చాట్‌బోట్‌ కంపెనీ ‘క్యారెక్టర్‌.ఏఐ’ సారథి (సీఈఓ)గా పనిచేశారు. అంతక్రితం మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటాలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. ప్రముఖ సినిమాలు, టీవీ కార్యక్రమాలకు పేరుగాంచిన డిస్నీ.. తన డిజిటల్‌ ఆఫరింగ్స్‌ను సైతం మరింత విస్తరించాలని చూస్తోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతికతపై ప్రత్యేక దృష్టి సారించిన సంస్థ.. ఆ కార్యకలాపాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సీటీఓ పదవిని ఏర్పాటు చేసుకుంది.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement