తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.









Comments