తిరుపతి చేరుకున్న లోకేశ్
తిరుపతి : మంత్రి లోకేశ్ మంగళవారం రాత్రి తిరుపతి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. రాత్రి 10 గంటలకు లోకేశ్ ఎయిర్‌పోర్టు చేరుకోగా... అప్పటికే ఆయనకు స్వాగతం పలికేందుకు నాయకులతో పాటు విమానాశ్రయం వెలుపల భారీగా పార్టీ శ్రేణులు చేరుకున్నాయి. 200 మందికి మాత్రమే పాసులు జారీ చేయడంతో పాసులు లేని వారిని లోనికి అనుమతించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. విమానాశ్రయ అధికారుల జోక్యంతో కార్యకర్తలు శాంతించారు. మంత్రి లోకేశ్ బుధవారం తిరుపతి, చంద్రగిరిల్లో క్రీడా సముదాయాలను ప్రారంభిస్తారు.










Comments