దేశంలో అదనంగా 75వేల మెడికల్ సీట్స్: నడ్డా
దేశంలో పేద, అణగారిన వర్గాలకు మంచి వైద్యం అందుతోందని కేంద్రమంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘ఆయుష్మాన్ భారత్ వంటి కార్యక్రమాలు ఆలస్యం చేయకుండా పేదలకు కూడా వైద్యం చేసేలా చేస్తున్నాయి. 70ఏళ్లు దాటితే ఆదాయం, కులం, మతంతో సంబంధంలేకుండా మెడికల్ ఇన్యూరెన్స్ పరిధిలోకి వస్తారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2029నాటికి దేశంలో మెడికల్ సీట్స్ సంఖ్య 75వేలు వరకు పెరుగుతాయి. గతేడాదే 23వేల సీట్లు పెంచాం’ అని తెలిపారు.









Comments