• Sep 20, 2026
  • NPN Log

    అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బంగారం, వెండి ధరలను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. ఇటీవల అమెరికా-ఇరాన్ యుద్ధంతో వీటి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. ఈరోజు (శుక్రవారం) ఉదయం 07:00 గంటల సమయానికి గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,430గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,46,160కి చేరుకుంది.

    ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,59,280కి చేరుకోగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.1,46,010కి చేరుకుంది. అలాగే, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,59,280ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,46,010గా ఉంది. ఇక, వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ.2,60,100కి చేరుకుంది.

     

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement