• Sep 20, 2026
  • NPN Log

    రాత్రి టీవీ, మొబైల్‌ చూస్తూ వీడియో గేమ్స్‌ ఆడుతూ పిల్లలు ఆలస్యంగా పడుకుంటారు. దీంతో నిద్ర సరిపోక ఉదయాన్నే లేవడం కష్టమవుతుంది. కాబట్టి రోజూ ఒకే సమయానికి పడుకునేలా చూడాలి. నిద్రకు ఉపక్రమించడానికి గంట ముందు నుంచే వాళ్లను స్ర్కీన్లకు దూరంగా ఉంచాలి. మంచి కథలు చెప్పడం, సంగీతం వినిపించడం చేస్తుంటే పిల్లలు హాయిగా నిద్రపోతారు. ఉదయం త్వరగా నిద్ర లేస్తారు కూడా.

    గాఢ నిద్రలో ఉన్న పిల్లల దగ్గర నిలబడి లేవమంటూ గట్టిగా అరవకూడదు. ముందుగా కిటికీల కర్టెన్లు తెరచి సూర్యకాంతి లోపలికి ప్రసరించేలా చూడాలి. తరువాత మెల్లగా పిలుస్తూ నిద్ర లేపాలి.

    ఎవరూ లేపకుండా తమంతట తామే నిద్ర లేచేలా పిల్లలకు అలవాటు చేయాలి. వాళ్లకి అలారం సెట్‌ చేయడం నేర్పించాలి. వాళ్లంతట వాళ్లే మేల్కొనే అవకాశం ఇవ్వాలి.

    వాటర్‌ బాటిల్స్‌ నింపుకోవడం, స్కూల్‌ బ్యాగ్‌ సర్దుకోవడం, స్నాక్స్‌ బాక్స్‌ పెట్టుకోవడం లాంటి పనులను పిల్లలకే అప్పజెప్పాలి. దీనివల్ల త్వరగా లేచి పనులు పూర్తిచేసుకోవాలన్న భావన వారికి కలుగుతుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement