పురుషులు, మహిళల జోరు
సమర్‌ఖండ్ (ఉజ్బెకిస్థాన్): డిఫెండింగ్ చాంపియన్లు భారత పురుషులు, మహిళలు జట్లు చెస్ ఒలింపియాడ్‌లో జోరు కొనసాగిస్తున్నాయి. వరుసగా నాలుగో రౌండ్‌లోనూ రెండు జట్లు గెలిచాయి. శనివారం జరిగిన పోరులో పురుషుల జట్టు 3-1తో స్పెయిన్‌ను చిత్తు చేసింది. అర్జున్, గుకేష్ తమ గేమ్‌లు నెగ్గగా.. ప్రజ్ఞానంద, నిహాల్ తమ గేమ్‌లు డ్రాగా ముగించారు. మహిళల జట్టు కూడా 3-1తో మంగోలియాపై గెలిచింది. సావిత్రి శ్రీ, దివ్యా దేశ్‌ముఖ్ విజయాలు దక్కించుకోగా.. కోనేరు హంపి, వైశాలీ ప్రత్యర్థులతో పాయింట్ పంచుకున్నారు.










Comments