పెళ్లికి ముందే బ్రేకప్
ముంబై: క్రికెటర్ పృథ్వీ షా, నటి ఆకృతి అగర్వాల్ విడిపోయారు. ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట పెళ్లికి ముందే తమ బంధానికి ము గింపు పలికింది. ఈమేరకు ఆకృతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘భవిష్యత్‌కు సంబంధించి మా లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయి. దీంతో ఇక కలిసి ఉండలేమని నిర్ణయించుకున్నాం’ అని తెలిపింది. అటు ఈ బ్రేక్‌పపై పృథ్వీ షా అధికారికంగా స్పందించకపోయినా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్ మినహా అన్నింటినీ తొలగించడం గమనార్హం. గత జూలైలోనే తాను మోసపోయానంటూ ఆకృతి చేసిన పోస్ట్‌తో వీరి బంధంపై నీలినీడలు కమ్ముకున్నాయి.










Comments