పవన్ ఖేరాకు సుప్రీంలో చుక్కెదురు
AICC మీడియా ఛైర్మన్ పవన్ ఖేరాకు SCలో చుక్కెదురైంది. అస్సాం CM హిమంత బిశ్వశర్మ భార్యకు 3పాస్‌పోర్ట్‌లు ఉన్నాయని చేసిన వ్యాఖ్యలపై అస్సాం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై ఖేరా తెలంగాణ హైకోర్టు నుంచి ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ పొందారు. అస్సాం పోలీసులు దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయగా హైకోర్టు ఆర్డర్‌పై స్టే విధించింది. ఖేరా అస్సాం హైకోర్టు లో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేస్తే దానిపై తమ ఉత్తర్వుల ప్రభావం పడదని పేర్కొంది.










Comments