బెంగాల్‌లోని 15 బూత్‌ల్లో నేడు రీపోలింగ్
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌ల్లో శనివారం రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్టు రిటర్నింగ్ అధికారులు, పరిశీలకులు సమర్పించిన నివేదికలు ఆధారంగా శుక్రవారం ఈ ఆదేశాలు ఇచ్చింది. మగ్రహట్ పశ్చిమ నియోజవర్గంలోని 11 బూత్‌లు, డైమండ్ హార్బర్‌లోని నాలుగు బూత్‌ల్లో రీపోలింగ్ జరగనుంది. కాగా, బెంగాల్‌లోని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కౌంటింగ్ సూపర్‌వైజర్లుగా కేవలం కేంద్రప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలన్న ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఓట్ల లెక్కింపు తేదీ సమీపిస్తుండడంతో శనివారమే అత్యవసరంగా విచారణ జరపాలని కోరనుంది.










Comments