బీసీలపై జగన్‌ది కపట ప్రేమ
రెంటచింతల : నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ప్రేమను ఒలకబోసే మాజీ సీఎం జగన్‌రెడ్డి.. ఓటమి బాధతో బీసీ వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లను అరేయ్, ఒరేయ్ అంటూ సంభోదించడం జుగుప్సాకరమైన విషయమని, బీసీలంతా దీన్ని ఖండిస్తున్నామని టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పల్నాడు జిల్లా రెంటచింతలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య, డీఐజీ గోపినాథ్ జెట్టిల పట్ల జగన్ అగౌరవంగా, చిన్నబుచ్చేలా మాట్లాడడం తగదన్నారు. బడుగు, బలహీన వర్గాలంటే జగన్‌కు ఉన్న కపట ప్రేమ అందరికీ అర్థమైందన్నారు. పరకామణి చోరీ వ్యవహారం చిన్న తప్పుగా జగన్ భావించడం భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీసినట్లేనని విమర్శించారు.








Comments