'మొగుడు' షూటింగ్లో ప్రమాదం.. విశాల్‌కు గాయాలు
తమిళ హీరో విశాల్ కు షూటింగ్ స్పాట్‌లో గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో పురుషన్ తెలుగులో మొగుడు అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ జానర్‌లో సినిమా తెరకెక్కుతోంది. కాగా ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర గ్లింప్స్ మంచి సినిమాపై మంచి బజ్ తీసుకు వచ్చింది.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే.. గురువారం ఆ సినిమాకు సంబంధించి పోరాట దృశ్యాలు చిత్రీకరిస్తుండగా విశాల్ స్వల్పంగా గాయపడ్డారు. దీనితో షూటింగ్‌ను నిలిపేశారు. ప్రస్తుతం విశాల్ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నారని ఆ చిత్రం యూనిట్ సభ్యులు తెలిపారు. ఈ మూవీలో విశాల్ సరసన తమన్నా మరోమారు హీరోయిన్‌గా నటిస్తోంది.










Comments