• Sep 20, 2026
  • NPN Log

    వివో లవర్స్ డోంట్ మిస్.. కొత్త వివో Y400 5జీ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. గత ఏడాది లాంచ్ అయిన ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ అసలు ధర కన్నా రూ.30వేలు తక్కువ ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు.ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ HD+ అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరాతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉంది. ఈ ఫోన్‌లో 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్‌పై అద్భుతమైన డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..

     

    తగ్గింపు ధర ఆఫర్ :
    వివో Y400 5G ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఫోన్ అసలు ధర రూ.60,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో 48 శాతం తగ్గింపుతో లభిస్తోంది. దాంతో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,998కి లభిస్తుంది. ఈ ఫోన్ వాల్యూ రూ.30వేలు కన్నా తక్కువకే మరో ఆఫర్ కూడా అందిస్తోంది.

    ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బిఐ క్రెడిట్ కార్డుతో వివో Y400 5G ఫోన్ కొనుగోలు చేస్తే.. రూ.1,600 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్‌ను రూ.30,388 ధరకు సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను ఈఎంఐలో కూడా కొనొచ్చు. 12 నెలల ఈఎంఐలో నెలకు కేవలం రూ.2,666 కడితే చాలు.. కంపెనీ నో-కాస్ట్ ఈఎంఐని కూడా అందిస్తోంది.

     

     

     

    స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :

    ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.67-అంగుళాల ఫుల్ HD+ (1,080×2,400 పిక్సెల్స్) అమోల్డ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్‌టచ్ OS 15పై రన్ అవుతుంది. అలాగే, డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP సోనీ IMX852 ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా కూడా అందించారు.

     

     

    ఈ 5జీ ఫోన్‌లో 6,000mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా ఇందులో 4G, 5G, Wi-Fi, బ్లూటూత్, GPS, OTG USB టైప్-C పోర్ట్ ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది.

     

     

    ఈ స్మార్ట్‌ఫోన్ గ్లామ్ వైట్ వెర్షన్ సైజు 162.29 × 75.31 × 7.99 మిమీ, బరువు సుమారుగా 198 గ్రాములు ఉంటుంది. ఆలివ్ గ్రీన్ వేరియంట్ సైజు 162.29 × 75.31 × 7.90 మిమీ ఉండగా, బరువు 197 గ్రాములు ఉంటుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement