• Sep 20, 2026
  • NPN Log

    స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , దర్శకుడు అట్లీ  కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ పెంచుతున్నాయి.  తాజాగా తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు సినిమా స్థాయిపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అట్లీ తనకు ‘రాకా’కు సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారని శిబి చక్రవర్తి తెలిపారు.

    ‘‘భారతీయ సినీరంగానికి గర్వకారణంగా నిలిచే సినిమాను అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఆయన నాకు కొన్ని విజువల్స్ చూపించారు. ‘అవతార్’లో కూడా అంత గొప్ప విజువల్స్ చూడలేదు. వాటిని వర్ణించడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదు. మరో రెండు, మూడు రోజుల్లో మీరందరూ వాటిని చూస్తారు. దర్శకుడు రాజమౌళి భారతీయ సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లినట్టే అట్లీ కూడా ‘రాకా’తో ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తారు. అట్లీకి శిష్యుడిగా ఉన్నందుకు గర్వంగా  ఉంది'' అని పేర్కొన్నారు. 

     


    శిబి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో ‘రాకా’పై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి. మరోవైపు చిత్రబృందం కూడా వరుస పోస్టులతో సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రెండు రోజుల క్రితం ‘37’ అనే నంబర్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్.. తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. ‘‘పరిమితులు దాటి ఆలోచించాం.. లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందడుగు వేశాం.. ఊహించిన దానికంటే ఎంతో ఎత్తుకు వెళ్లాం’’ అనే అర్థం వచ్చేలా ఆ వీడియోను రూపొందించారు. త్వరలోనే ‘రాకా’కు సంబంధించిన కీలకమైన గ్లింప్స్‌ను విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.  

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement