రాఘవ్ చడ్ఢాకు షాక్.. Z+ సెక్యూరిటీ విత్డ్రా!
AAP నేత, రాజ్యసభ MP రాఘవ్ చడ్ఢాకు పంజాబ్ సర్కార్ షాకిచ్చినట్లు సమాచారం. ఆయనకు ఉన్న Z+ కేటగిరీ భద్రతను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీతో విభేదాల నేపథ్యంలో ఇటీవలే ఆయన్ను రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించారు. పంజాబ్ పోలీసుల తాజా నిర్ణయంతో కేంద్రం ఆయనకు సెంట్రల్ సెక్యూరిటీని కేటాయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఆయనకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.










Comments