• May 01, 2026
  • NPN Log

    తిరుపతి : ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పాటు తిరుపతిలో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రి ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎస్.వి. ఆటోనగర్ సమీపంలోని ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చేరుకుంటారు. రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. బుధవారం ఉదయం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను మంత్రి లోకేశ్ ప్రారంభిస్తారు.

    అనంతరం చంద్రగిరికి మంత్రి లోకేశ్ బయలుదేరి వెళ్తారు. స్థానిక బాలురు కళాశాలలో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణంతోపాటు ఇండోర్ స్టేడియంను ఆయన ప్రారంభిస్తారు. మంత్రి లోకేశ్ తిరిగి తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి కూడలి సమీపంలోని రామానాయుడు గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ పాల్గొంటారు.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement