• Sep 20, 2026
  • NPN Log

    మంగళగిరి  : మహిళల ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూఏపీఎల్‌) ఆరంభ మ్యాచ్‌లో రాయలసీమ జెన్‌ స్టార్స్‌ జట్టు శుభారంభం చేసింది. శనివారం మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) మైదానంలో జరిగిన పోరులో గోదావరి గోల్డెన్‌ ఈగల్స్‌పై రాయలసీమ జట్టు గెలిచింది. తొలుత గోదావరి 20 ఓవర్లలో 7 వికెట్లకు 116 పరుగులు చేసింది. కెప్టెన్‌ పెరీరా అర్ధ సెంచరీ (63)తో రాణించింది. అనూష 3 వికెట్లు తీసింది. ఛేదనలో రాయలసీమ 17.3 ఓవర్లలో 120/3 స్కోరు చేసి గెలిచింది. రెండో మ్యాచ్‌లో అమరావతి ఈ చాంపియన్స్‌ 17 రన్స్‌తో వైజాగ్‌ ఫైర్‌బర్డ్స్‌ను ఓడించింది. ఇక, మ్యాచ్‌కు ముందు జరిగిన డబ్ల్యూఏపీఎల్‌ ఆరంభ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నారా బ్రాహ్మణి.. లీగ్‌ అంబాసిడర్‌ మిథాలీ రాజ్‌, జట్ల కెప్టెన్లతో కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు.

     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement