• Sep 20, 2026
  • NPN Log

    నీటి చుక్కలను పొందికగా పేర్చి తయారుచేశారా అన్నట్లుండే వాటర్‌ డ్రాప్‌లెట్‌ జ్యువెలరీ నేటి ఫ్యాషన్‌ ట్రెండ్‌గా నిలుస్తోంది. రెజిన్‌ అనే పాలిమర్‌తో నీటి చుక్కలను, వాటిని జోడించే సన్నని దారాన్ని తయారుచేస్తారు. వీటితో రకరకాల ఫ్యాషన్‌ ఆభరణాలను రూపొందిస్తారు. ఇవి కాంతిని పరావర్తనం చెందిస్తూ రంగురంగులుగా మెరుస్తూ యువతులను విరివిగా ఆకర్షిస్తున్నాయి. పొడవాటి జుంకాలు, చోకర్లు, సింగిల్‌ డ్రాప్‌ పెండెంట్‌ చెయిన్లు, బ్రేస్‌లెట్లను అమ్మాయిలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. తెలుపు, నీలం రంగుల్లో మెరిసే వాటర్‌ డ్రాప్‌లెట్లకు డిమాండ్‌ అధికంగా ఉంటోంది.

    గ్రీస్‌, రోమన్‌, ఈజిప్ట్‌ నాగరికతల కాలంలోనే ఈ వాటర్‌ డ్రాప్‌లెట్ల తయారీ ప్రారంభమైంది. కొన్ని రకాల మొక్కల నుంచి జిగురులా లభించే రెజిన్‌ను వర్షపు చినుకులు, నీటి చుక్కల మాదిరి మలిచి ఆరబెట్టేవారు. గట్టిగా గాజు మాదిరి మెరిసే ఈ డ్రాప్‌లెట్స్‌తో క్లాసిక్‌ శైలిలో నగలు తయారుచేసేవారు. ఇరవయ్యో శతాబ్దంలో ఐరోపాలో వచ్చిన ఆర్ట్‌ నోవూ ఉద్యమంతో ఈ వాటర్‌ డ్రాప్‌లెట్‌ నగలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు సైతం వీటిపై దృష్టి సారించి వినూత్నమైన డిజైన్లకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఫ్లోటింగ్‌ వాటర్‌ డ్రాప్‌ నగల ట్రెండ్‌ కొనసాగుతోంది. యూవీ రెజిన్‌ లిక్విడ్‌తో తయారుచేసిన డ్రాప్‌లెట్స్‌ స్వచ్ఛమైన నీటి చుక్కలను తలపిస్తూ మహిళలను ఆకట్టుకుంటున్నాయి.

    క్లాసీ, మినిమలిస్టిక్‌ జ్యువెలరీగా పేరుపొందిన వాటర్‌ డ్రాప్‌, రైన్‌ డ్రాప్‌ నగలు నేటి ఫ్యాషన్‌ ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. వీటి స్టయిలింగ్‌ కూడా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. ఆఫీస్‌ వేర్‌, వి నెక్‌ వైట్‌ షర్ట్‌, జీన్స్‌, వెస్ట్రన్‌ డ్రెస్‌ల మీద సింగిల్‌ వాటర్‌ డ్రాప్‌ పెండెంట్‌ చెయిన్‌, మెటాలిక్‌ స్టడ్స్‌ ఎంపిక చేసుకుంటే ఎలిగెంట్‌గా కనిపిస్తారు. ఈవెనింగ్‌ పార్టీలు, ఫంక్షన్లలో రైన్‌ డ్రాప్‌లెట్స్‌తో కూడిన ఇయర్‌ డాంగ్లింగ్స్‌, మల్టీ లేయర్డ్‌ చోకర్స్‌ ముఖానికి పంక్‌ వైబ్‌ నిస్తాయి. కుర్తీలు, అనార్కలీలు, ఇండో-వెస్ట్రన్‌ గౌన్స్‌, సిల్క్‌ శారీస్‌ మీద గ్రీన్‌, రెడ్‌ కలర్‌ స్టోన్స్‌ లేదా ముత్యాలు జతచేసిన రైన్‌/వాటర్‌ డ్రాప్‌ సెట్స్‌ క్లాసీ లుక్‌నిస్తాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement