వానతి శ్రీనివాసన్కు మద్దతుగా కుమారుడి ప్రచారం
చెన్నై: కోయంబత్తూర్ ఉత్తరం నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఆ పార్టీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యం కారణంగా ఆమె కోవైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుదిదశలో చేరుకున్న నేపథ్యంలో వానతి శ్రీనివాసన్ తరఫున ఆమె కుమారుడు ఆదర్శ్ నియోజకవర్గం కలియ తిరుగుతూ అమ్మకు మద్దతుగా ఓట్లు అభ్యర్థిస్తున్నారు.










Comments