• Sep 20, 2026
  • NPN Log

    అఫ్గానిస్థాన్, భారత్ మధ్య జరిగిన తొలి టీ20ఐ మ్యాచ్‌తో టీమ్ఇండియా సత్తా చాటింది. అభిషేక్ విజృంభణ(32 బంతుల్లో 82)తో నిర్ణీత లక్ష్యాన్ని 13.4 ఓవర్లోనే ఛేదించి విజయం సాధించింది. అయితే విజయానందంలో ఉన్న అభిమానులు ఓ విషయంపై మాత్రం కాస్త సీరియస్‌గా ఉన్నారు. తుది జట్టు కూర్పుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తొలి టీ20లో 15 ఏళ్ల సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి బదులుగా సంజూ శాంసన్‌కు అవకామివ్వగా.. అతడు పేలవ ప్రదర్శన కనబరిచాడు. కేవలం 10 పరుగులే చేసి పెవిలియన్ బాటపట్టాడు. దీంతో అతడి ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైభవ్‌ను కాదని అతడికి ఎందుకు ఛాన్స్ ఇచ్చారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

    ఒత్తిడిలో శాంసన్?

    తొలుత ఆటలో విఫలమైన శాంసన్ ఆ తరువాత ఒత్తిడిలో కనిపించాడు. 2024లో వరుస సెంచరీలతో భారత జట్టులో పునరాగమనం చేసిన సంజూ గ్రౌండ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దానికితోడు ఓపెనర్ స్లాట్ కోసం నెలకొన్న పోటీ కూడా అతడిపై భారం పెంచింది. ఇలాంటి సమయంలో వైభవ్‌ను పక్కన పెట్టి సంజూను ఎంచుకోవడం ఎంత వరకు కరెక్ట్.? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. ఒకే ఒక ఇన్నింగ్స్‌తో శాంసన్‌ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకోవడం సబబు కాదనే వాదనలూ అతడికి మద్దతిస్తున్నాయి. ఏది ఏమైనా సంజూ టీమ్ఇండియాలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే రానున్న మ్యాచ్‌లో నిలకడగా ఆడాల్సి ఉంటుంది. ఇప్పటికే అతడిపై ఉన్న ఇన్‌కన్సిస్టెన్సీ విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలి.

    రేపే రెండో టీ20

    మూడు టీ20 మ్యాచ్‌ల కోసం అఫ్గానిస్థాన్‌ భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ రేపు(మంగళవారం) జరగనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగానే ఈ మ్యాచ్ కూడా జరగనుంది.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement