• Sep 20, 2026
  • NPN Log

    ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఎదుర్కొనేందుకు అత్యంత కఠినమైన ప్లేయర్ ఎవరు?’ అని ప్రశ్నించగా.. దానికి టెస్టు దిగ్గజం చతేశ్వర్ పుజారా అని సమాధానమిచ్చాడు. పుజారా తలుచుకుంటే ఎంతేసేపయినా బ్యాటింగ్ కొనసాగించగలడని ప్రశంసించాడు. అతణ్ని ఔట్ చేయడమనేది ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కష్టతరంగా ఉండేదని తెలిపాడు. ‘భారత్ తరఫున ఎదుర్కొనేందుకు అత్యంత కఠినమైన ప్లేయర్ పుజారా. అతడు వంద డాట్ బాల్స్ అయినా ఆడడానికి ఇష్టపడతాడు. కానీ వికెట్ మాత్రం కోల్పోడు. బౌలర్లకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడు’ అని కమ్మిన్స్ కొనియాడాడు.

    అలాగే పాకిస్థాన్ నుంచి స్పిన్నర్ సయీద్ అజ్మల్‌ను ఎదుర్కోవడం కష్టమని కమ్మిన్స్ చెప్పాడు. ఇంగ్లండ్ నుంచి అలిస్టర్ నాథన్ కుక్, సౌత్ ఆఫ్రికా నుంచి ఏబీ డివిలియర్స్, న్యూజిలాండ్ నుంచి బ్రెండన్ మెక్‌కల్మ్, శ్రీలంక నుంచి తిలకరత్నే దిల్షాన్, వెస్టిండీస్‌ తరఫున హెన్రీ క్రిస్ గేల్ అత్యంత కఠినమైన ప్లేయర్స్ అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం కమ్మిన్స్ సౌతాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలు మూడు వన్డేలు, టెస్ట్ మ్యాచ్‌ల్లో పోటీపడుతున్నాయి.

    కాగా.. టీమ్ఇండియాకు టెస్టుల్లో ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన చతేశ్వర్ పుజారా గతేడాది అంతర్జాతీయ క్రికెట్ నుంచి అధికారికంగా రిటైరయ్యాడు. భారత్ తరఫున అతడు 7,195 పరుగులు సాధించాడు. అందులో 19 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement