• Sep 20, 2026
  • NPN Log

    టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్  నటించిన క్రేజీ యాక్షన్-అడ్వెంచర్ చిత్రం ‘సిగ్మా’. దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ట్రైలర్  ఎలా ఉందో గమనిస్తే.. ట్రైలర్ ఆద్యంతం స్టైలిష్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ కంటెంట్‌తో ఆకట్టుకునేలా సాగింది. ‘‘ఈ జూదము, మత్తు.. కాయిన్‌కి రెండు వైపుల్లాంటివి.. ఈ రెండూ అలవాటు చేస్తే కోట్లు సంపాదించవచ్చు..’’.. ‘ఎంత? ఐదు వందల కోట్లు!’ అంటూ నడిచే వాయిస్ ఓవర్ కథ ప్రధాన ఇతివృత్తాన్ని ఆసక్తికరంగా రివీల్ చేసింది. భారీ క్యాసినో మాఫియా, డ్రగ్స్, కోట్ల రూపాయల హవాలా నేపథ్యంలో సాగే పక్కా హై-వోల్టేజ్ క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ కథను తీర్చిదిద్దినట్లు స్పష్టమవుతోంది.

    ‘కోట్లపాడి వీరయ్య రెడ్డి’ అనే భయంకరమైన అండర్‌వరల్డ్ డాన్ పాత్రలో సీనియర్ నటుడు పవర్‌ఫుల్ విలనిజాన్ని చూపించారు. ‘‘ఆయన ఆకలి కోసం వేటాడటం మొదలుపెట్టాడు.. మొత్తం అడవంతా ఆయన కంట్రోల్‌లోనే ఉంది’’ అంటూ విలన్ పాత్ర తీవ్రతను ఎలివేట్ చేశారు. ఇక సందీప్ కిషన్ రెండు భిన్నమైన షేడ్స్‌లో కనిపించి అలరించారు. మొదట్లో క్యాజువల్ కుర్రాడిగా, రేడియో జాకీ 'సామ్' (ఫరియా అబ్దుల్లా)తో ప్రేమాయణం నడిపే సరదా ప్రేమికుడిగా కనిపించిన సందీప్.. ఆ తర్వాత ‘‘ఓడిపోవడం నాకు కొత్త కాదు.. కానీ ఆడేబ్బా.. మోసం చేసే వాళ్లను వదిలేదే లేదు’’ అంటూ మాస్ యాక్షన్ అవతార్‌లోకి మారిపోయి ట్రైలర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు.
     

    ఓ స్టార్ హీరో కొడుకుగా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న జేసన్ సంజయ్.. మొదటి సినిమాతోనే తన విజువల్ మేకింగ్, కట్‌లతో అదరగొట్టాడనే చెప్పాలి. ఫాస్ట్ పేస్ స్క్రీన్‌ప్లే, స్టైలిష్ ఛేజింగ్స్, గన్ ఫైట్స్ హాలీవుడ్ స్టాండర్డ్స్‌ను తలపించేలా ఉన్నాయి. దీనికి ఎస్. థమన్ అందించిన పల్స్ పెంచే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఎన్‌వీఆర్ సినిమా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందీప్ కిషన్‌కు మాత్రమే కాకుండా, దర్శకుడిగా జేసన్ సంజయ్‌కి కూడా అదిరిపోయే డెబ్యూ హిట్‌ను అందించేలా కనిపిస్తోంది. మొత్తంగా ‘సిగ్మా’ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసిందనడంలో అతిశయోక్తి లేనే లేదు. చూద్దాం మరి.. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో..

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement