సైబర్ కి‘లేడీ’.. కేడీ.. రూ.24.44 లక్షలు కొల్లగొట్టేసింది...
హైదరాబాద్ : గోల్డ్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెడితే అనతికాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ లేడీ ఓ వ్యక్తిని మోసం చేసి రూ.24.44 లక్షలు కొల్లగొట్టింది. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన 47 ఏళ్ల వ్యక్తికి ఒక నంబర్ నుంచి వాట్సాప్ మెసేజ్ వచ్చింది. శరణ్యగా పరిచయం చేసుకున్న మహిళ.. కొద్దిరోజుల్లోనే స్నేహితురాలిగా మారింది. అనంతరం తన పథకం ప్రారంభించింది.
తన వద్ద మంచి గోల్డ్ ఇన్వె్‌స్టమెంట్ ప్లాన్ ఉందని, అందులో పెట్టుబడులు పెడితే అనతి కాలంలోనే అధిక లాభాలు వస్తాయని నమ్మించింది. ‘కేడీఈ వన్ గోల్డ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. వివరాలు నమోదు చేసి యూజర్ ఐడీ, పాస్‌వర్డు ఇచ్చింది. ప్రారంభంలో కొద్దిమొత్తంలో పెట్టుబడి పెట్టిన బాధితునికి 70 శాతం లాభాలు వచ్చినట్లు వర్చువల్‌గా చూపించి ఆశపెట్టారు.
దీంతో భారీగా పెట్టుబడి పెట్టాడు. లాభంతో కలిపి రూ.39 లక్షలు వచ్చినట్లు చూపించారు. విత్‌డ్రా కోసం ప్రయత్నించగా ట్యాక్స్, కన్వర్షన్ చార్జెస్ అంటూ రూ.లక్షల్లో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దాంతో ఇదేదో మోసమని గ్రహించిన బాధితుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ‘కేడీఈ వన్ గోల్డ్’ అనేది నకిలీ యాప్‌గా పోలీసులు గుర్తించారు.









Comments