• Nov 05, 2025
  • NPN Log

    న్యూఢిల్లీ: దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ చిన్న కుమారుడు అన్వయ్‌ అండర్‌-19 వన్డే చాలెంజర్‌ ట్రోఫీకి ఎంపికయ్యాడు. బుధవారం నుంచి హైదరాబాద్‌ వేదికగా జరిగే ఈ టోర్నీలో ‘సి’ జట్టు తరఫున 17 ఏళ్ల అన్వయ్‌ పాల్గొంటున్నాడు. టాపార్డర్‌ బ్యాటర్‌, వికెట్‌ కీపర్‌గా అన్వయ్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆరోన్‌ జార్జ్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఏ, బి, సి, డి జట్లు పోటీపడే ఈ టోర్నీ 11న ముగియనుంది. కాగా, ద్రవిడ్‌ పెద్ద కుమారుడు సమిత్‌.. మహారాజా టీ20 కేఎ్‌ససీ ట్రోఫీలో ఆడిన తెలిసిందే.


     

    You Might Also Like

    Comments

    Leave A Comment

    Don’t worry ! Your email address will not be published. Required fields are marked (*).

    Featured News

    Advertisement