అద్భుతం.. జైపూర్ ఫుట్ తరహాలో ‘వైజాగ్ హ్యాండ్’
వైజాగ్‌లోని ఏపీ మెడిటెక్ జోన్ దివ్యాంగుల కోసం కృత్రిమ చేయిని అభివృద్ధి చేసింది. ప్రమాదాల్లో చేతులు కోల్పోయిన వారికి ఉపయోగపడేలా ‘వైజాగ్ హ్యాండ్’ పేరుతో దీనిని రూపొందించింది. ఇటీవల ఓ మహిళకు అమర్చగా ఆమె స్వయంగా పనులు చేసుకున్నారని సంస్థ ప్రతినిధులు తెలిపారు. జైపూర్ ఫుట్ తరహాలో చేతులు కోల్పోయిన వారికి ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు. సోలార్ పవర్‌తో నడిచే వీల్‌చైర్లను కూడా తయారు చేస్తున్నామని చెప్పారు.
Comments