వలపు వల.. వృద్ధుడు విలవిల
తెలంగాణ : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన ఓ వృద్ధుడు(81) చిక్కుకున్నాడు. మాయ రాజ్‌పుత్ అనే మహిళ పేరిట అతడికి జూన్ మొదటివారంలో స్కామర్స్ వాట్సాప్ కాల్ చేశారు. చనువుగా మాట్లాడుతూ ట్రాప్ చేసి ఆస్పత్రి ఖర్చులు, ప్లాట్ రిజిస్ట్రేషన్, బంగారు ఆభరణాలు విడిపించడం కోసమంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ద్వారా రూ.7.11 లక్షలు కాజేశారు. ఇంకా డబ్బులు డిమాండ్ చేయడంతో అనుమానించిన వృద్ధుడు పోలీసులను ఆశ్రయించాడు.
Comments