వాట్సాప్ చాట్.. రూ.కోట్లు పోగొట్టుకున్న వృద్ధుడు
ముంబైకి చెందిన ఓ 80 ఏళ్ల వృద్ధుడు సైబర్ క్రైమ్ బారిన పడి రూ.9 కోట్ల మేర నష్టపోయాడు. 2023 ఏప్రిల్ నుంచి శార్వీ, కవిత, దినాజ్, జాస్మిన్ పేర్లతో ఆయనకు ఒకరు వలపు వల విసిరి రొమాంటిక్ వాట్సాప్ చాట్ చేశారు. దీంతో వారి బ్యాంకు ఖాతాలకు 734 సార్లు రూ.8.7 కోట్లు పంపాడు. తన బ్యాంకు ఖాతా ఖాళీ అయి కుటుంబసభ్యులను కూడా డబ్బులు అడుగుతుండటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ వృద్ధుడు ఆస్పత్రి పాలయ్యాడు.
Comments