అభివృద్ధికి అడ్డుపడితే తోలు తీస్తాం..! -కుప్పంతో సమానంగా అభివృద్ధి పరుగులు ..! -అరాచక శక్తులకు అభివృద్ధితోనే సమాధానం..!
-మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జూలకంటి ఆగ్రహం..
మాచర్ల సర్వతోముఖాభివృద్ధి వైపు నియోజకవర్గం పరుగులు పెడుతున్న వేళా రాజకీయంగా కుట్రపన్ని అడ్డుకోవాలని చూస్తే తోలు తీస్తాం అని వైసీపీ సోషల్ మీడియా మూకలను ఉద్దేశించి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పట్టణంలో పలు అభివృద్ధి పనులు పట్టాలెక్కిన తరుణంలో వాటిని పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీ పొట్టి శ్రీరాములు జల్ మిషన్ పథకం ద్వారా రూ. 1200 కోట్లతో భారీ వాటర్ గ్రిడ్ ను నెలకొల్పి.., నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ మరో ఏడాదిలో తాగునీరు అందించబోతున్నామని చెప్పారు. ఇప్పటికే గ్రామాల్లో పెద్ద ఎత్తున వాటర్ పైప్స్ అందుబాటులోకి వచ్చాయని..., ఆ అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు హడలిపోతున్నారని ఎద్దేవా చేశారు. నాడు పిన్నెల్లి సోదర్ల అరాచకాన్ని చూసిన ప్రజలు.., నేడు కూటమి ప్రభుత్వ హయంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రశంసిస్తున్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న మౌళిక వసతుల అభివృద్ధిని చూసి.., వైసీపీ నేతలకు నిద్రపట్టడం లేదని విమర్శించారు. దమ్ముంటే మాజీలైన గోపిరెడ్డి, పావుకాసు రెడ్డి అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆనాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంతో సమానంగా మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.
అరాచక శక్తులకు అభివృద్ధితోనే సమాధానం..!
వైసీపీ ప్రత్యేక రాజ్యాంగం అంటూ మూకలు సోషల్ మీడియాలో చేస్తున్న రాద్దాంతం అంతా అరాచకం, దోపిడి, దౌర్జన్యాలు, శవ రాజకీయాలతో ముడిపడి ఉంటాయని ఎమ్మెల్యే జూలకంటి విమర్శించారు. అటువంటి అరాచక శక్తులకు అభివృద్ధితోనే సమాధానం చెప్తామన్నారు. టీడీపీ సోషల్ మీడియా చూస్తే అంతా అభివృద్ధి, సంక్షేమమే ఉంటుందని.., రాజారెడ్డి రాజ్యాంగం పేరుతో రాష్ట్రంలో సృష్టించిన రక్తపాతానికి ప్రజలు 11 సీట్లు ఇచ్చి జగన్ ను ఇంట్లో కూర్చొపెట్టినా ఇంకా సిగ్గురాలేదని గుర్తు చేశారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో జగన్ అండ్ కో దళితులను ఊచకోస్తే.., కూటమి ప్రభుత్వం హయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని హక్కున చేర్చుకుంటూ ఆదుకుంటున్నారన్నారు. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించి, ఆయన కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










Comments