చదువు అన్నారెడ్డికి ఘన సన్మానం
గత కొన్నేళ్లుగా ముల్కలపల్లి-మొగుళ్లపల్లి గ్రామాల మధ్యన నిర్వహిస్తున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో ముల్కలపల్లి వాస్తవ్యుడు, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి పాత్ర ఏనలేనిది. ఇరు గ్రామాల జాతర కమిటీ సభ్యులను సమన్వయం చేసి, జాతర ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించి, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతర ఉత్సవాలను నిర్వహిస్తున్నందుకు ముల్కలపల్లి స్ట్రైవర్స్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు ఓనపాకల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ప్రాంగణంలో సంక్రాంతి పర్వదినాన చదువు అన్నారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఇటీవలే నూతనంగా ఎన్నికైన మొగుళ్ళపల్లి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్, ముల్కలపల్లి సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్, ముల్కలపల్లి గ్రామ ఉపసర్పంచ్ నీల రాజు కురుమలను శాలువాలతో యూత్ సభ్యులు సత్కరించారు. ఈ సన్మాన కార్యక్రమంలో యూత్ సభ్యులు ఓనపాకల సాగర్, ఓనపాకల సంతు, ఓనపాకల అంజి, ఓనపాకల నగేష్, ఓనపాకల నగేష్, ముల్కలపల్లి వార్డు సభ్యులు ఓనపాకల రాజకుమార్, ఇనుగాల అనిల్ తదితరులున్నారు.








Comments