అమ్మ ఒడికి చేరిన పసికందు!
చెన్నూరు : మద్యానికి బానిసైన తండ్రి ఆదివారం విక్రయించిన ఐదు వారాల కుమారుడిని చెన్నూరు పోలీసులు తల్లికి అప్పగించారు. వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన బాలకుమార్, లక్ష్మీనారాయణ దంపతులకు ముగ్గురు పిల్లలు. తాగుడుకు బానిసైన బాలకుమార్ మూడో బిడ్డను చెన్నూరు సీహెచ్‌సీలో పనిచేసే ఓ నర్సుతో రూ.50 వేలకు విక్రయించాడు. ఈ విషయమై లక్ష్మీనారాయణ భర్తతో పాటు సీహెచ్‌సీలో పనిచేసే నర్సు కవిత, సెక్యూరిటీ గార్డు భైరవపై బుధవారం చెన్నూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఏఎ్‌సఐ శంకరనాయక్ ఆధ్వర్యంలో హెడ్‌కానిస్టేబుల్ శ్రీరాములు మైదుకూరు ఐసీడీఎస్ అధికారులను వెంటబెట్టుకుని బుధవారం ప్రొద్దుటూరులో ఓ మహిళ వద్ద ఉన్న బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు.









Comments