అయ్యో రుతిక.. ఎంతపని చేశావమ్మా.. ఏం జరిగిందంటే..
హైదరాబాద్: పండగ వేళా ఆ ఇంట్లో విషాదం అలుముకొంది. చదువుకో.. అతిగా మొబైల్ వాడొద్దని కూతురును తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అల్వాల్ ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మచ్చబొల్లారం, గోపాల్‌నగర్ ద్వారకనగర్ కాలనీకి చెందిన అర్చన, నాగార్జున భార్యాభర్తలు. వీరికి రుతిక(19) అనే కూతురు ఉంది. అల్వాల్ లయోలా కాలేజీ లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.
చదువును నిర్లక్ష్యం చేయడం, తరుచుగా ఫోన్‌లో మాట్లాడటం, చాటింగ్ చేయడంతో కూతుర్ని తల్లి మందలించేది. బుధవారం కూడా మందలించడంతో మనస్థాపానికి గురైన రుతిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు.









Comments