ఆరోగ్యంగా ఉండటమే పెద్ద అదృష్టం: సమంత
ఒక్కసారి అనారోగ్యం వస్తే దాని ముందు ఏ సమస్యా అంత పెద్దగా అనిపించదని నటి సమంత అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతింటే మన దృష్టంతా దానిపైనే ఉంటుంది. ఏ ఇబ్బందులూ మనల్ని బాధించవు. ప్రస్తుతం నేను ఫుడ్, స్లీప్, మెంటల్ హెల్త్‌పై శ్రద్ధ వహిస్తున్నా. అందుకే ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉన్నా’ అని అన్నారు. అలాగే ప్రతి అమ్మాయీ వెయిట్ ట్రైనింగ్‌పై దృష్టి పెట్టాలని సామ్ సూచించారు.
Comments