ఇంటర్నేషనల్ టీ-20 టీమ్ ను ప్రకటించిన సికందర్ రాజా.. కెప్టెన్ ఎవరంటే..
ఇటీవలే టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో యంగ్ ప్లేయర్ శుభ్ మన్ గిల్ ను టీమిండియా కొత్త సారథిగా ఎంపిక చేశారు. అయితే ఈ నిర్ణయంపై క్రికెట్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలానే రోహిత్ ఫ్యాన్స్ అయితే సెలక్షన్ కమిటీపై ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చే న్యూస్ ఒకటి వచ్చింది. రోహిత్ శర్మను కెప్టెన్ గా ప్రకటించారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రాజా ఆల్‌టైమ్ అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించాడు. ఇంటర్నేషనల్ టీ20ల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో ఈ జట్టును ఎంపిక చేశాడు. ఈ ఆల్‌టైమ్ టీ20 XIIకు టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ను సారథిగా ఎంపిక చేశాడు. భారత్ నుంచి రోహిత్ శర్మతో పాటు జడేజా, బుమ్రాకు ఈ జట్టులో చోటు దక్కింది. అలానే దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరూ, వెస్టిండీస్ నుంచి ముగ్గురు, ఆసీస్, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ల నుంచి ఒక్కో ప్లేయర్ ఎంపికయ్యాడు. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీలకు ఈ జట్టులో స్థానం దక్కలేదు. ఫ్రాంచైజీ క్రికెట్లోనూ కోహ్లీకి తిరుగులేదు. నిలకడకు మారుపేరైనా కోహ్లీ పేరు ఆల్‌టైమ్ టీ20 ఎలెవన్‌లో లేకపోవడాన్ని అతని అభిమానులు తప్పుబడుతున్నారు..
ఆల్‌టైమ్ టీ20 ఎలెవన్ జట్టు ఓపెనర్లుగా క్రిస్ గేల్, రోహిత్ శర్మను సికిందర్ రాజా ఎంపిక చేశాడు. అలానే వికెట్ కీపర్‌గా నికోలస్ పూరన్‌ను, ఏబీ డివిలియర్స్, హెన్రీచ్ క్లాసెన్, కీరన్ పొలార్డ్ ఫినిషర్లుగా ఎంచుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా జడేజాను, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రషీద్ ఖాన్‌ను సికిందర్ తీసుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాహిద్ అఫ్రిదిలను పేసర్లుగా ఎంచుకున్నాడు.
సికందర్ రాజా ఆల్‌టైమ్ T20 ఎలెవన్:
రోహిత్ శర్మ(కెప్టెన్), క్రిస్ గేల్, నికోలస్ పూరన్, ఏబీ డివిలియర్స్, హెన్రీచ్ క్లాసెన్, కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, షాహిన్ షా అఫ్రిది, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్.
Comments