ఇసుక అక్రమ రవాణా కు అడ్డుకట్ట వేయాలి : మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య- చిట్యాల ఏఎంసీ మార్కెట్ మాజీ చైర్మన్ కొడారి రమేష్ యాదవ్
కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ,జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ టేకుమట్ల మండల బిఆర్ఎస్ నాయకుల అరెస్టుకు నిరసనగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం మొగుళ్లపల్లి బస్టాండ్ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఇసుక అక్రమ రవాణాను ప్రశ్నించినందుకు అరెస్టు అయిన బిఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇసుక దళారులుగా మారి ప్రభుత్వ పథకాలతో పేరుతో దోచుకుంటున్నారని నాయకులు ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.
Comments