ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50 వేలు: సీఎం
ఆంధ్రప్రదేశ్ : రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే ప్రభుత్వం తమది అని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘ఉల్లి రైతులకు నష్టం జరగకుండా హెక్టారుకు రూ.50వేలు చెల్లించాలని నిర్ణయించాం. దీంతో 45వేల ఎకరాల ఉల్లి రైతులకు లబ్ధి చేకూరుతుంది. పంట పూర్తిగా సిద్ధం అయిన తర్వాత ఆరబెట్టి, గ్రేడింగ్ చేసి మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. వారి పంటతో సంబంధం లేకుండానే ఈ-పంట ఆధారంగా హెక్టారుకు రూ.50వేలు చెల్లిస్తాం’ అని సీఎం ప్రకటించారు.
Comments